గురువారం 25 ఫిబ్రవరి 2021
Sports - Jan 15, 2021 , 06:38:42

గబ్బా టెస్ట్‌.. రెండో వికెట్‌ కోల్పోయిన ఆసిస్‌

గబ్బా టెస్ట్‌.. రెండో వికెట్‌ కోల్పోయిన ఆసిస్‌

బ్రిస్బేన్‌ : బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరుగుతున్న నిర్ణయాత్మకమైన నాలుగో టెస్ట్‌ మ్యాచ్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగగా.. తొలి ఓవర్‌లోనే భారత బౌలర్లు షాక్‌ ఇచ్చారు. సిరిస్‌లో సరైన ఫామ్‌లో లేక ఇబ్బందిపడుతున్న డేవిడ్‌ వార్నర్‌(1)ని మహ్మద్‌ సిరాజ్‌ పెవిలియన్‌కు పంపాడు. ఆడిన తొలి ఓవర్‌ నాలుగో బంతికి స్లిప్‌లో రోహిత్ శర్మకు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. ఫస్ట్‌ స్లిప్‌కు కాస్త ముందు పడుతున్న బంతిని రెండో స్లిప్‌లో ఉన్న రోహిత్‌ డైవ్‌ చేసి అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. అనంతరం బౌలింగ్‌కు దిగిన శార్దుల్‌ ఠాకూర్‌ తాను వేసిన తొలి బంతికే హారిస్‌ను ఔట్‌ చేశాడు. స్క్వేర్ లెగ్ ఫీల్డింగ్‌‌ చేస్తున్న వాషింగ్టన్ సుందర్ చక్కని క్యాచ్ పట్టాడు. ప్రస్తుతం లబుషైన్‌ (8), స్టీవ్‌ స్మిత్‌ (15) క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా రెండు వికెట్ల నష్టానికి 35 పరుగులు చేసింది.

ఓ వైపు గాయాలతో సతమవుతున్న భారత్‌.. మరోవైపు గెలవాల్సిన మ్యాచ్‌ (మూడో టెస్ట్‌)ను డ్రాగా చేసుకున్న ఆసీస్‌ తలపడనున్నాయి. టాస్‌‌ నెగ్గిన ఆసీస్‌ కెప్టెన్‌ టిమ్‌ పెయిన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. జట్టు కూర్పు కోసమే ఇబ్బంది పడిన భారత్‌ నాలుగో టెస్ట్‌లోనూ నిలకడగా రాణించాలని ఆశిస్తోంది. స్వదేశంలో టీమిండియాను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఆసీస్‌  భావిస్తోంది. ఇప్పటికే నాలుగు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌, ఆసీస్‌ 1-1తో సమంగా ఉన్నాయి. తొలి టెస్ట్‌ను టీమిండియా ఓడిపోగా.. రెండో మ్యాచ్‌ను భారత్‌ గెలిచింది. మూడో టెస్ట్‌ డ్రాగా ముగిసింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆడటానికి భారత్‌ నుంచి 11 మంది ఉంటారా? అనే పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే. సిరీస్‌లో ప్రతి టెస్టుకు ముందు రోజే భారత జట్టు కూర్పును ప్రకటించేవారు. కానీ ఈ టెస్టు విషయానికి వచ్చేసరికి టాస్‌కు కాస్త ముందుగా వెల్లడించారు. 

టీమిండియా జట్టు: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, మయాంక్‌ అగర్వాల్‌, రిషబ్‌ పంత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌‌ ఠాకూర్‌, నవదీప్‌ సైని, మహ్మద్‌ సిరాజ్‌, టి. నటరాజన్‌. 

ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్‌ వార్నర్‌, మార్కస్‌ హారిస్‌, మార్నస్‌ లబుషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, మాథ్యూ వేడ్‌, కామెరూన్‌ గ్రీన్‌, టిమ్‌ పెయిన్‌, ప్యాట్‌ కమిన్స్‌, మిచెల్‌ స్టార్క్‌, నాథన్‌ లైయన్‌, జాష్‌ హేజిల్‌వుడ్

VIDEOS

logo