బుధవారం 08 జూలై 2020
Sports - May 12, 2020 , 21:39:29

ఆసీస్‌లోనూ స్పిన్ పిచ్‌లు ఏర్పాటు చేయాలి: జాంపా

ఆసీస్‌లోనూ స్పిన్ పిచ్‌లు ఏర్పాటు చేయాలి:  జాంపా

మెల్‌బోర్న్: ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట‌ర్‌గా ముద్ర వేయించుకోవ‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని ఆస్ట్రేలియా యువ స్పిన్న‌ర్ ఆడ‌మ్ జాంపా పేర్కొన్నాడు. ఇటీవ‌లి కాలంలో లిమిటెడ్ ఓవ‌ర్స్‌లో మాత్ర‌మే ఆసీస్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అత‌డు ఆసీస్‌లో మ‌రిన్ని స్పిన్నింగ్ పిచ్‌లు ఏర్పాటు చేయాల‌ని కోరుతున్నాడు. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి కార‌ణంగా ప్ర‌స్తుతం విశ్వ‌వ్యాప్తంగా క్రీడాలోకం మొత్తం స్త‌భించిపోయిన నేప‌థ్యంలో ప్లేయ‌ర్లు సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా అభిమానుల‌తో ట‌చ్‌లో ఉంటున్నారు. ఈ క్ర‌మంలో జాంపా మాట్లాడుతూ..

`ఆసీస్‌లో ప్ర‌ధానంగా పేస్‌కు అనుకూలించే పిచ్‌లే ఉంటాయి. స్పిన్న‌ర్ల‌కు స‌హ‌క‌రించే పిచ్‌ల‌ను కూడా రూపొందించ‌డ‌మే మంచింది. వైట్‌బాల్ క్రికెట్‌కే ప‌రిమిత‌మ‌వ్వాల‌నుకోవ‌డం లేదు. అన్ని ఫార్మాట్‌ల‌లో ఆసీస్‌కు ప్రాతినిధ్యం వ‌హించాల‌నుకుంటున్నా` అని జాంపా అన్నాడు.


logo