గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 12, 2020 , 12:51:42

‘ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్‌’ నిర్ణయం థర్డ్‌ అంపైర్‌దే..!

‘ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్‌’ నిర్ణయం థర్డ్‌ అంపైర్‌దే..!

తొలి మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.

దుబాయ్‌:  క్రికెట్‌ మ్యాచ్‌లో  ఫ్రంట్‌ఫుట్‌ నోబాల్స్‌ గుర్తించడంలో ఫీల్డ్‌ అంపైర్లు విఫలమవుతుండటంతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)  కీలక నిర్ణయం తీసుకుంది. బౌలర్లు గీతదాటి వేసిన నోబాల్స్‌ను థర్డ్‌ అంపైర్‌ చూస్తారని పేర్కొంది.    భారత్, వెస్టిండీస్‌ల్లో జరిగిన 12 మ్యాచ్‌ల్లో థర్డ్‌ అంపైర్‌కు ప్రయోగాత్మకంగా ఈ బాధ్యతలను అప్పగించి ఐసీసీ పరిశీలించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 21 నుంచి ఆస్ట్రేలియా వేదికగా ఆరంభమయ్యే మహిళల టీ20 ప్రపంచకప్‌లో  ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్‌ను థర్డ్‌ అంపైర్‌ పర్యవేక్షిస్తాడని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.  సిడ్నీలో వేదికగా తొలి మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.  మహిళల టీ20 వరల్డ్‌కప్‌ ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. logo