క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్ కెరియర్ గురించి చెప్పాలంటే ఒక్క రోజు సరిపోదు, పుస్తకాలు కూడా సరిపోవు. అంతర్జాతీయ క్రికెట్లో ఆయన లిఖించిన అధ్యాయాలు అన్నీ ఇన్ని కావు. భారత జట్టుకి ఎన్నో అద్భుతమైన విజయాలు అందించిన సచిన్ ప్రేక్షకుల మదిలో మాస్టర్ బ్లాస్టర్గా నిలిచాడు. క్రికెట్‌కు గుడ్ బై చెప్పినా కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులని అలరిస్తూనే ఉన్నాడు సచిన్.
సచిన్‌కు వంట పట్ల మక్కువ ఎక్కువ అనే సంగతి మనందరికి తెలిసిందే. గతంలో పలుమార్లు కిచెన్‌లోకి దూరి అనేక వెరైటీలు చేశాడు సచిన్. తాజాగా తన ఆత్మీయలు కోసం మరోసారి మాస్టర్ చెఫ్ అవతారం ఎత్తాడు. తాను వండేది ఎవరికీ తెలియదని.. తనకు కూడా అది ఏంటో తెలియదు అంటూ సచిన్ సరదాగా చెప్పుకొచ్చాడు. ఈ వంటకంలో తన క్రికెట్ టెక్నిక్‌ని సైతం ఉపయోగించినట్టు స్పష్టం చేశాడు. మొత్తానికి సచిన్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. సచిన్ గతంలో తన తల్లి కోసం ఎంతో ఇష్టమైన బైగాన్ బర్తా వండిన విషయం తెలిసిందే.