బుధవారం 28 అక్టోబర్ 2020
Sports - Sep 26, 2020 , 03:07:27

వెయ్యి మందికే అనుమతి

వెయ్యి మందికే అనుమతి

  • ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ప్రేక్షకుల పరిమితిపై ఆంక్షలు 

పారిస్‌: ప్రమాదకర కరోనా వైరస్‌ అంతకంతకూ విస్తరిస్తున్న నేపథ్యంలో ఫ్రెంచ్‌ ఓపెన్‌లో ప్రేక్షకుల పరిమితిని కుదించారు. నానాటికి పెరుగుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని ఫ్రాన్స్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో రోజుకు 11,500 మంది ఫ్యాన్స్‌కు అనుమతి ఇవ్వాలనుకున్న ఆ దేశ ప్రభుత్వం వైరస్‌ వ్యాప్తిని అంచనా వేస్తూ సంఖ్యను వెయ్యికి కుదించింది. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి జీన్‌ కాస్టెక్స్‌ కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.  ఈనెల 27 నుంచి మొదలవుతున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో తొలుత రోజుకు 11,500 మందికి అనుమతి ఇవ్వాలనుకున్నారు. ఆ తర్వాత ఆ సంఖ్యను 5 వేలకు తగ్గించి.. తాజాగా వెయ్యి మందికి మాత్రమే అవకాశం కల్పించారు. 


logo