ఆదివారం 07 మార్చి 2021
Sports - Jan 16, 2021 , 02:01:57

ర్యాలీ రేసులో ఫ్రాన్స్‌ డ్రైవర్‌ మృతి

ర్యాలీ రేసులో ఫ్రాన్స్‌ డ్రైవర్‌ మృతి

జెడ్డా(సౌదీ అరేబియా): డాకర్‌ ర్యాలీ ఎంత ప్రమాదకరమో మరోమారు తెలిసివచ్చింది. అత్యంత కఠిన పరిస్థితుల మధ్య రేసులో డ్రైవర్లు పోటీపడే తీరు ఒళ్లు గగుర్పొడుస్తుంది. లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదలతో పోటీపడే రేసర్లు ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. సౌదీ అరేబియా వేదికగా జరిగిన డాకర్‌ ర్యాలీ రేసులో ఫ్రాన్స్‌ డ్రైవర్‌ పియరీ చెర్పిన్‌(52) మృతి చెందాడు. మోటార్‌బైక్‌ ప్రమాదానికి గురికావడంతో పియరీ తలకు బలమైన దెబ్బ తగిలింది. మెరుగైన వైద్యం కోసం జెడ్డా నుంచి ఫ్రాన్స్‌కు తరలించినా లాభం లేకపోయింది.

VIDEOS

logo