శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Jul 29, 2020 , 02:15:52

‘ఫ్రీ బాల్‌' రూల్‌ తేవాలి: అశ్విన్‌

 ‘ఫ్రీ బాల్‌' రూల్‌ తేవాలి: అశ్విన్‌

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. మన్కడింగ్‌పై కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చాడు. బౌలర్‌ చేతి నుంచి బంతి విడుదల కాకముందే నాన్‌స్ట్రయికర్‌ క్రీజును వదిలి ముందుకు వెళ్తే.. ఆ పరుగును పూర్తి చేసేందుకు అనుమతించకూడదని పేర్కొన్నాడు. ఒకవేళ అది సాధ్యపడకపోతే.. తర్వాతి బంతిని ‘ఫ్రీ బాల్‌'గా ప్రకటించేలా నిబంధనలు మార్చాలని సూచించాడు. వన్డే సూపర్‌ లీగ్‌లో ఫ్రంట్‌ ఫుట్‌ నోబాల్‌ నిర్ణయాన్ని టీవీ అంపైర్‌కు అప్పగించిన నేపథ్యంలో అశ్విన్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. ‘బంతి వేయకముందే నాన్‌స్ట్రయికర్‌ క్రీజు దాటితే.. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి పరుగులను అనుమతించని పరిస్థితి వస్తుందని ఆశిస్తున్నా’ అని మంగళవారం ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.


logo