శనివారం 26 సెప్టెంబర్ 2020
Sports - Aug 01, 2020 , 12:01:25

ఐపీఎల్‌-13: సఫారీలను రప్పించడం ఎలా?

ఐపీఎల్‌-13: సఫారీలను రప్పించడం ఎలా?

ముంబై:  యూఏఈ వేదికగా సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 8 వరకు ఐపీఎల్‌-13 సీజన్‌ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నది.  అన్ని ఫ్రాంఛైజీలు కూడా అక్కడ తమకు కావాల్సిన ఏర్పాట్లను ఇప్పటికే చేసుకోవడం ప్రారంభించాయి.  అందరికన్నా ముందుగా ఆగస్టు 10వ తేదీన యూఏఈకి వెళ్లేందుకు చెన్నై సూపర్‌ కింగ్స్‌ రెడీ అవుతున్నట్లు తెలిసింది.

 కరోనా వల్ల సౌతాఫ్రికా క్రికెటర్లను ఐపీఎల్‌ కోసం యూఏఈకి తీసుకురావడం ఫ్రాంఛైజీలకు సవాల్‌గా మారేలా కనిపిస్తున్నది. దక్షిణాఫ్రికాలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో పాల్గొనే సఫారీ క్రికెటర్లను యూఏఈకి ఎలా తీసుకురావాలన్నదానిపై ఆయా ఫ్రాంఛైజీలు ఆలోచిస్తున్నాయి. 

డివిలియర్స్‌(బెంగళూరు), కగిసో రబాడ(ఢిల్లీ), డుప్లెసిస్‌(చెన్నై), క్వింటన్‌ డికాక్‌(ముంబై), ఇమ్రాన్‌ తాహిర్‌(చెన్నై)  లాంటి స్టార్‌ క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడాలని ఆ జట్టు కోరుకుంటున్నాయి. వీరికోసం ఛార్టర్‌ విమానాలను పంపి ఆటగాళ్లను యూఏఈకి రప్పించాలని ప్రాంఛైజీలు భావిస్తున్నాయి.    ఆదివారం జరిగే ఐపీఎల్‌ పాలకమండలి సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారని బోర్డు అధికారి ఒకరు తెలిపారు.  అందరినీ ఒకే విమానంలో తీసుకురావాలని కూడా ఆలోచిస్తున్నట్లు మరో అధికారి చెప్పారు. 


logo