శుక్రవారం 04 డిసెంబర్ 2020
Sports - Oct 20, 2020 , 20:27:56

వరుసగా నాలుగోసారి 50+ స్కోరు సాధించిన ధావన్‌

వరుసగా నాలుగోసారి 50+ స్కోరు సాధించిన ధావన్‌

దుబాయ్:‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ పరుగుల వరదపారిస్తున్నాడు. ఐపీఎల్‌-13వ సీజన్‌లో వరుసగా నాలుగోసారి 50+ స్కోరు   సాధించాడు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో ధావన్‌  28 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో ధావన్‌కిది 40వది కావడం విశేషం. మరో ఎండ్‌లో బ్యాట్స్‌మన్‌  సహకరించకున్నా తన దూకుడును కొనసాగిస్తున్నాడు. 11 ఓవర్లకు ఢిల్లీ 2 వికెట్లకు 90 పరుగులు చేసింది. ప్రస్తుతం ధావన్‌(57), రిషబ్‌ పంత్‌(10) క్రీజులో ఉన్నారు.