మెల్బోర్న్: న్యూజిలాండ్ మాజీ ఆల్‌రౌండర్ క్రిస్ కెయిన్స్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. తీవ్ర అనారోగ్యంతో గతవారం ఆస్ట్రేలియాలోని కాన్బెర్రాలో గల ఓ దవాఖానాలో చేరిన కెయిన్స్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తున్నట్టు ఓ మీడియా రిపోర్టు వెల్లడించింది. ప్రస్తుతం అతడికి వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నారు. కెయిన్స్ శరీరం చికిత్సకు సహకరించట్లేదని రిపోర్టులో పేర్కొన్నారు. ప్రపంచ ఉత్తమ ఆల్‌రౌండర్‌గా పేరొందిన కెయిన్స్ 90వ దశకంలో న్యూజిలాండ్ తరఫున 62 టెస్టులు, 215 వన్డేలు ఆడాడు.