శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Sports - Aug 15, 2020 , 12:27:16

మహిళల క్రికెట్‌లో తొలిసారి.. బౌలర్‌ అరుదైన ఘనత

మహిళల క్రికెట్‌లో తొలిసారి.. బౌలర్‌ అరుదైన ఘనత

చెన్నై:  మహిళల క్రికెట్లో భారత సంతతి క్రికెటర్‌ అనురాధ దొడ్డబళ్లాపూర్‌ అరుదైన ఘనత సాధించింది. జర్మనీ విమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ అనురాధ ఆస్ట్రియాతో జరిగిన టీ20లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి చరిత్ర సృష్టించింది. టీ20ల్లో  ఈ రికార్డు సాధించిన తొలి మహిళా క్రికెటర్‌గా ఆమె రికార్డు నెలకొల్పింది. అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన  జర్మనీ 20 ఓవర్లలో 198 పరుగులు చేసింది. 

క్రిస్టినా(101 నాటౌట్‌)  శతకంతో విజృంభించగా మరో ఓపెనర్‌  జానెట్‌ రొనాల్డ్స్‌(68 నాటౌట్‌) హాఫ్‌సెంచరీతో చెలరేగింది.    అనంతరం లక్ష్య ఛేదనలో బౌలర్ అనురాధ( 5/1) విరుచుకుపడటంతో ఆస్ట్రియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 61 పరుగులే చేయడంతో జర్మనీ 137 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. మ్యాచ్‌లో  మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్‌ చేసిన అనురాధ అద్బుత గణాంకాలు నమోదు చేసింది. గతంలో ఆమె కర్ణాటక క్రికెట్‌ సంఘం తరఫున కూడా ఆడింది. logo