గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Feb 21, 2020 , 23:11:41

క్రికెట్‌కు ఓజా వీడ్కోలు

క్రికెట్‌కు ఓజా వీడ్కోలు

న్యూఢిల్లీ: టీమ్‌ఇండియా లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా.. అంతర్జాతీయ, ఫస్ట్‌క్లాస్‌  క్రికెట్‌కు శుక్రవారం రిటైర్మెంట్‌  ప్రకటించాడు. 2009లో టీమ్‌ఇండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఓజా చివరగా 2013 నవంబర్‌లో వెస్టిండీస్‌పై వాంఖడేలో టెస్ట్‌ ఆడాడు. ఆ మ్యాచ్‌తోనే దిగ్గజ ఆటగాడు సచిన్‌  టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడం విశేషం. అనుమానాస్పద బౌలింగ్‌ కారణంగా 2014లో ఓజాపై ఐసీసీ..  వేటు వేసింది. యాక్షన్‌ను సరి చేసుకొని 2015లో అనుమతి పొందిన తర్వాత ఓజా మునుపటిలా రాణించలేకపోయాడు.  టీమ్‌ఇండియా తరఫున 24టెస్టులు ఆడిన ఓజా 113వికెట్లు తీసుకున్నాడు. 18 వన్డేల్లో 21, ఆరు అంతర్జాతీయ టీ20ల్లో 10వికెట్లు సాధించాడు. ఐపీఎల్‌ల్లో దక్కన్‌ చార్జర్స్‌, ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడాడు. ఫస్ట్‌క్లాస్‌  క్రికెట్‌లో హైదరా బాద్‌  తరఫున దాదాపు 11 ఏండ్ల పాటు బరిలోకి దిగిన ఓజా.. ఆ తర్వాత బెంగాల్‌, బీహార్‌  తరఫున ఆడాడు.  logo
>>>>>>