సోమవారం 30 నవంబర్ 2020
Sports - Oct 12, 2020 , 12:12:56

భారత మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ హఠాన్మరణం ...

భారత మాజీ ఫుట్ బాల్ ప్లేయర్ హఠాన్మరణం ...

బెంగళూరు : భారత మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు  కార్ల్ టన్ సోమవారం ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు ఆదివారం రాత్రి బెంగళూరులో తీవ్రమైన వెన్నునొప్పితో బెంగళూరులోని ఓ ఆసుపత్రి లో చేరిన అయన గుండె పోటుతో చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. 49 ఏండ్ల కార్ల్ టన్  ఇదివరకు చంపాన్... తూర్పు బెంగాల్, జేసీటీ మిల్స్ మిడ్ ఫీల్డర్‌గా దేశానికి ఎనలేని సేవలందించారు. 2001లో రిటైర్మెంట్ ప్రకటించి... కోచ్‌గా మారాడు. 1980లో బెంగళూరులోని సాయ్ సెంటర్‌లో తన కెరీర్ ప్రారంభించారు చంపాన్. బెంగళూరు క్లబ్‌కి చెందిన సదరన్ బ్లూస్ తరపున ఆడారు.

1990లో టాటా ఫుట్‌బాల్ అకాడెమీలో చేరారు. 1993 వరకూ క్లబ్‌తో ఉండి... గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి... ఈస్ట్ బెంగాల్ వెళ్లారు. అక్కడ రెండేళ్లు ఆడి... 1995లో జేసీటీ మిల్స్ కి సైన్ చేశాడు. 1993లో ఆసియన్ కప్‌లో బెంగాల్ ఫస్ట్ సీజన్‌లో హ్యాట్ ట్రిక్ కొట్టి... ఇరాకీ క్లబ్ అల్ జవ్రాకి షాక్ ఇచ్చాడు. జేసీటీ మిల్స్ తరపున 14 టోర్నమెంట్‌లు గెలిచింది చంపాన్ టీమ్. సంతోష్ ట్రోపీ కింద చంపాన్... కర్ణాటక, పంజాబ్, బెంగాల్ తరపున ఆడారు.1971 ఏప్రిల్ 13న పుట్టిన ఇండియన్ ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్. క్వార్ట్ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ అకాడెమీకి... ఆయన టెక్నికల్ డైరెక్టర్‌గా సేవలందించారు.

1995 నుంచి 2001 వరకూ... ఇండియన్ నేషనల్ ఫుట్ బాల్ టీమ్‌కి మిడ్ ఫీల్డర్‌గా చేశారు. కెప్టెన్ గానూ ఉన్నాడు. క్లబ్ లెవెల్లో... ఆయనకు సక్సెస్‌ఫుల్ కెరీర్ ఉంది. అటు ఈస్ట్ బెంగాల్, ఇటు జేసీటీ మిల్స్ లో సత్తా చాటి... ఇండియన్ ఫుట్‌బాల్ కి గుర్తింపు తెస్తూ... కోట్లాది మంది అభిమానుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్నారు. తన జీవితమంతా... ఆటకే అంకితం చేసిన చంపాన్‌ సేవలను అభిమానులు స్మరించుకుంటున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.