శనివారం 27 ఫిబ్రవరి 2021
Sports - Jan 18, 2021 , 10:14:39

ఐసీయూలో టీమిండియా మాజీ స్పిన్న‌ర్‌

ఐసీయూలో టీమిండియా మాజీ స్పిన్న‌ర్‌

బెంగళూరు: ఇండియ‌న్ టీమ్ మాజీ స్పిన్న‌ర్ బీఎస్ చంద్ర‌శేఖ‌ర్ ఆసుప‌త్రిలో చేరారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డగానే ఉన్న‌ద‌ని క‌ర్ణాట‌క క్రికెట్ అసోసియేష‌న్ అధికార ప్ర‌తినిధి విన‌య్ మృత్యుంజ‌య వెల్ల‌డించారు. సోమ‌వారం ఉద‌యం మ్యాచ్ చూస్తున్న స‌మ‌యంలో ఆయ‌న స‌డెన్‌గా ఆయాసంగా ఉన్న‌ద‌ని అన్నార‌ని, మాట కూడా త‌డ‌బ‌డింద‌ని చంద్ర‌శేఖ‌ర్ భార్య సంధ్య తెలిపారు. వెంట‌నే ఆసుప‌త్రికి తీసుకెళ్లామ‌ని, ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యంగానే ఉన్నార‌ని చెప్పారు. మ‌రో రెండు రోజుల్లో ఇంటికి తిరిగి వ‌స్తార‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. 

VIDEOS

logo