బుధవారం 30 సెప్టెంబర్ 2020
Sports - Aug 15, 2020 , 18:30:12

వెంటిలేటర్‌పై భారత మాజీ క్రికెటర్‌

వెంటిలేటర్‌పై భారత మాజీ క్రికెటర్‌

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్‌ చేతన్‌ చౌహాన్‌ ఆరోగ్యం విషమంగా ఉన్నది.   ప్రస్తుతం ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై  ఆయన చికిత్స పొందుతున్నారు. గతనెలలో కరోనా బారినపడిన మాజీ ఓపెనర్‌ ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. అతని శరీరంలోని చాలా అవయవాలు ఇప్పటికే పూర్తిగా దెబ్బతిన్నాయి. గురుగ్రామ్‌లోని  ఓ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స  తీసుకుంటున్నారు.  ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌  ప్రభుత్వంలో 73ఏండ్ల చౌహాన్‌ కేబినెట్‌ మంత్రిగా ఉన్నారు.

జూలై 12 కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఆయన లక్నోలోని సంజయ్‌ గాంధీ పీజీఐ హాస్పిటల్‌లో చేరారు.  అక్కడ అతని ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడకపోగా మరింత క్షీణించింది.  దీంతో ఆయనను గురుగ్రామ్‌లోని మెదాంతకు తరలించారు. చికిత్స సమయంలోనే ఆయనకు బీపీతో పాటు కిడ్నీ సంబంధ సమస్యలు తలెత్తాయి. భారత్‌ తరఫున 40 టెస్టులు ఆడిన చౌహాన్‌..లెజండరీ సునీల్‌ గావస్కర్‌తో సుదీర్ఘకాలం ఓపెనర్‌గా బరిలో దిగారు.  అలాగే ఢిల్లీ అండ్‌ డిస్ట్రిక్ట్స్‌ క్రికెట్‌ అసోసియేషన్‌లో పలు హోదాల్లో పనిచేశారు. 

తాజావార్తలు


logo