గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Sep 15, 2020 , 17:30:39

భారత మాజీ క్రికెట‌ర్ మృతి

భారత మాజీ క్రికెట‌ర్ మృతి

ముంబై: భార‌త మాజీ క్రికెట‌ర్ స‌దాశివ్ రావూజీ పాటిల్ (86) మృతిచెందారు. కొల్హాపూర్‌లోని రుయ్‌కార్ కాల‌నీలోగ‌ల‌ త‌న నివాసంలో రాత్రి భోజనం చేసి ప‌డుకున్న పాటిల్‌ నిద్ర‌లోనే తుదిశ్వాస విడిచారు. ఈ తెల్ల‌వారుజామున నిద్ర‌లేవ‌కపోయేస‌రికి కుటుంబ‌స‌భ్యులు ఆయ‌న మ‌ర‌ణించిన విష‌యం గుర్తించారు. పాటిల్‌కు భార్య‌, ఇద్ద‌రు కూతుళ్లు ఉన్నారు. ఆయ‌న భార‌త్ త‌ర‌ఫున ఒకే ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడారు. ఆ త‌ర్వాత తిరిగి ఎప్పుడూ దేశానికి ప్రాతినిధ్యం వ‌హించే అవ‌కాశం ద‌క్క‌లేదు. 

ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండ‌ర్ అయిన ఎస్ఆర్ పాటిల్ 1955లో న్యూజీలాండ్‌తో ఏకైక టెస్టు మ్యాచ్ ఆడారు. అయితే, మ‌హారాష్ట్ర త‌ర‌ఫున మాత్రం 1952-64 మ‌ధ్య‌ ఆయ‌న 36 ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 866 ప‌రుగులు చేశారు. 83 వికెట్లు తీశారు. అంతేగాక‌, పాటిల్ ఒక రంజీ ట్రోఫీలో మ‌హారాష్ట్ర రంజీ జ‌ట్టుకు కెప్టెన్‌గా కూడా వ్య‌వ‌హ‌రించారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo