ఆదివారం 09 ఆగస్టు 2020
Sports - Jul 11, 2020 , 17:49:44

భారత మాజీ క్రికెటర్‌ భార్యకు కరోనా పాజిటివ్‌

భారత మాజీ క్రికెటర్‌ భార్యకు కరోనా పాజిటివ్‌

కోల్‌కతా: టీమిండియా మాజీ క్రికెటర్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి లక్ష్మీ రతన్‌ శుక్లా భార్యకు కరోనా వైరస్‌ సోకిందని  అధికారులు తెలిపారు.  రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న స్మితా సన్యాల్‌ శుక్లాకు వైద్య పరీక్షలు నిర్వహించగా కొవిడ్‌-19  పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వారు చెప్పారు. ఆమెకు స్వల్ప జ్వరం ఉండటంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నారని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

 'అవును, నా భార్య స్మితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  ఆమెకు కొంచెం జ్వరం ఉంది. వైద్యులు ఇచ్చిన మందులను  వేసుకుంటున్నది.  నేను, మా ఇద్దరు కుమారులు, నా తండ్రి ఇంట్లోనే స్వీయ నిర్భంధంలో ఉన్నాం.  వచ్చే గురువారం మేమంతా కరోనా పరీక్షలు చేయించుకుంటామని' రతన్‌ శుక్లా వివరించారు.   బెంగాల్‌ రంజీ టీమ్‌కు శుక్లా కెప్టెన్‌గా వ్యవహరించిన  విషయం తెలిసిందే. 


logo