బుధవారం 03 జూన్ 2020
Sports - Apr 04, 2020 , 23:51:19

రోహిత్‌, వార్నర్‌ అత్యుత్తమ జోడీ

రోహిత్‌, వార్నర్‌ అత్యుత్తమ జోడీ

  • టామ్‌ మూడీ  

న్యూఢిల్లీ:  టీ20ల్లో రోహిత్‌శర్మ, డేవిడ్‌ వార్నర్‌ అత్యుత్తమ ఓపెనింగ్‌ జోడీ అంటూ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ టామ్‌ మూడీ కితాబిచ్చాడు. సోషల్‌మీడియా ట్విట్టర్‌లో శనివారం పలువురు అడిగిన ప్రశ్నలకు మూడీ సమాధానమిచ్చాడు. ‘టీ20ల్లో రోహిత్‌, వార్నర్‌..బెస్ట్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మెన్‌.  ప్రపంచంలో ఏ బౌలర్‌నైనా ఎదుర్కొనే సత్తా వీరిద్దరికి ఉంది. భారత్‌లో అద్భుత ప్రతిభ కల్గిన క్రికెటర్లకు కొదువలేదు. ఈ మధ్య కాలంలో శుభ్‌మన్‌ గిల్‌ బాగా ఆకట్టుకుంటున్నాడు. ఐపీఎల్‌లో నా ఫేవరెట్‌ జట్టు చెన్నై,  కెప్టెన్‌ ధోనీ. న్యూజిలాండ్‌ సారథి విలియమ్సన్‌..అద్భుతమైన మేధోసంపత్తి ఉన్న క్రికెటర్‌. భారత ఫీల్డర్లలో జడేజా అత్యుత్తమం, నా ఫేవరెట్‌ టీమ్‌ఇండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ’ అని మూడీ ట్వీట్‌ చేశాడు.


logo