ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Sports - Aug 11, 2020 , 18:04:19

ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ లోర్నా బీల్ కన్నుమూత

ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ లోర్నా బీల్ కన్నుమూత

మెల్బోర్న్: ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ లోర్నా బీల్ (96) కన్నుమూశారు. ఆస్ట్రేలియా తరఫున ఏడు టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన లోర్నా బీల్.. న్యూజిలాండ్‌తో 1948 లో వెల్లింగ్టన్‌ లో జరిగిన మొదటి మహిళల టెస్ట్ మ్యాచులో అరంగేట్రం చేశారు. బీల్ 1923 లో మెల్బోర్న్ లోని హౌథ్రోన్ లో జన్మించాడు. కుడిచేతి వాటం బ్యాటింగ్, వికెట్ కీపర్ అయిన బీల్.. సౌత్ హౌథ్రోన్ లేడీస్ క్రికెట్ క్లబ్‌లో చేరడానికి ముందు 12 ఏండ్ల వయసులో క్రికెట్‌ను చేపట్టారు. తరువాత హౌథ్రోన్ లేడీస్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించారు. 1951 లో ఆస్ట్రేలియా పర్యటనలో ఆస్ట్రేలియా తరఫున ఆరు టెస్టులు ఆడిన బీల్.. 1951 పర్యటన తరువాత క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఆమె ఏడు సంవత్సరాలు నేషనల్ లేడీస్ గోల్ఫ్ యూనియన్ కౌన్సిల్ సభ్యురాలుగా,  బాక్స్ హిల్ గోల్ఫ్ క్లబ్ కెప్టెన్ గా సేవలందించారు. పయనీర్ విక్టోరియన్ లేడీస్ క్రికెట్ అసోసియేషన్ సభ్యురాలుగా కూడా ఉన్నారు.

లోర్నా బీల్ మరణం ఆస్ట్రేలియాలోని బడ్డింగ్ క్రికెటర్లకు తీరని లోటని, ఆమె చూపిన బాటలో ఎందరో మహిళా క్రికెటర్లు రాటుదేలారని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో నిక్ హాక్లే నివాళులర్పించారు.


logo