ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Sports - Jan 17, 2021 , 00:30:07

క్రీడాభివృద్ధిపై దృష్టి పెట్టండి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

క్రీడాభివృద్ధిపై దృష్టి పెట్టండి: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ ఆట ప్రతినిధి: రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని స్టేడియాల అభివృద్ధి, మరమ్మతులు, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులకు సూచించారు. శనివారం రవీంద్రభారతిలో క్రీడాశాఖపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ర్టాన్ని క్రీడాహబ్‌గా తీర్చిదిద్దేందుకు మెరుగైన క్రీడా వసతుల కల్పన కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ, సరూర్‌నగర్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయం సైక్లింగ్‌ వెల్‌డ్రోమ్‌ మరమ్మతులకు ఎంత నిధులు అవసరమవుతాయో చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో సాట్స్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్‌రెడ్డి, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మరోవైపు ఎల్బీ స్టేడియంలో బాస్కెట్‌బాల్‌, స్కేటింగ్‌ మైదానం వినియోగంపై ప్లేయర్ల మధ్య ఏర్పడిన సమస్యను పరిష్కరించాలని శ్రీనివాసరాజును మంత్రి ఆదేశించారు. 

VIDEOS

logo