గురువారం 02 జూలై 2020
Sports - May 16, 2020 , 00:58:13

ఆస్ట్రేలియాతోఐదు టెస్టులు కష్టం: దాదా

ఆస్ట్రేలియాతోఐదు టెస్టులు కష్టం: దాదా

న్యూఢిల్లీ: క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) ప్రతిపాదించినట్లు ఈ ఏడాది ఆఖర్లో ఆసీస్‌తో ఐదు టెస్టులు ఆడటం అసాధ్యమని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పష్టం చేశాడు. షెడ్యూల్‌ ప్రకారం డిసెంబర్‌లో ఆసీస్‌తో భారత్‌ నాలుగు మ్యాచ్‌ల బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీ ఆడాల్సి ఉంది. శుక్రవారం గంగూలీ మాట్లాడుతూ ‘ఆసీస్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ సాధ్యం కాకపోవచ్చు. టెస్టులతో పాటు పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడాలి. 14 రోజుల క్వారంటైన్‌ నిబంధనలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల పర్యటన మరింత సుదీర్ఘమవుతుంది’అని అన్నాడు. 

ఐసీసీని దాదా నడిపించగలడు: గోవర్‌ 

ఐసీసీని నడిపించే రాజకీయ లక్షణాలు బీసీసీఐ చీఫ్‌ గంగూలీకి ఉన్నాయని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ డేవిడ్‌ గోవర్‌ అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ అధ్యక్షునిగా గంగూలీ ఇప్పటికే నిరూపించుకున్నాడని, ఏదో ఒక రోజు ఐసీసీ పీఠాన్ని దక్కించుకుంటాడని గోవర్‌ అన్నాడు. 


logo