మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Nov 10, 2020 , 17:51:27

అంతిమ పోరు.. టైటిల్ ఎవరిదో..?

అంతిమ పోరు.. టైటిల్ ఎవరిదో..?

దుబాయ్: ఐపీఎల్‌-13వ  సీజన్‌  ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది.  మంగళవారం దుబాయ్‌ వేదికగా జరిగే ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో  ఢిల్లీ క్యాపిటల్స్‌ అమీతుమీ తేల్చుకోనుంది. తొలి టైటిల్‌ దక్కించుకోవాలని శ్రేయస్‌ అయ్యర్‌ సారథ్యంలోని ఢిల్లీ ఆసక్తితో ఉండగా.. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోని ముంబై  ఐదో టైటిల్‌పై   కన్నేసింది.  సీజన్‌ లీగ్‌ దశలో  ఢిల్లీతో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబై విజయం సాధించింది. 

తొలిసారి ఫైనల్‌ చేరిన ఢిల్లీ  ఇప్పటి వరకు ఆరు సార్లు ఫైనల్‌ చేరిన ముంబైని ఎలా ఎదుర్కొంటుందో ఆసక్తికరంగా మారింది.  క్వాలిఫయర్‌-2లో హైదరాబాద్‌పై  పోరాడి గెలిచిన ఢిల్లీ  టైటిల్‌ పోరులో ముంబైకి గట్టిపోటీనివ్వనుంది.