బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Mar 01, 2020 , 23:44:11

లిటన్‌ సెంచరీ

లిటన్‌ సెంచరీ
  • జింబాబ్వేపై బంగ్లా గెలుపు

సిలెట్‌: బ్యాట్స్‌మెన్‌ విజృంభణకు.. బౌలర్ల జోరు తోడవడంతో జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్‌ జట్టు 169 పరుగుల తేడా తో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ (126; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదం తొక్కడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన బంగ్లా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 321 పరుగులు చేసింది. మిథున్‌ (50) అర్ధశతకం చేశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన జింబాబ్వే ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. బంగ్లా బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన జింబాబ్వే చివరకు 39.1 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. మంగళవారం ఇరు జట్ల మధ్య రెండో వన్డే జరుగనుంది.


logo
>>>>>>