లండన్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో హైదరాబాదీ స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్ ( Mohammed Siraj ) తనదైన మార్క్ చూపిస్తున్నాడు. పైన ఫొటో చూశారు కదా.. ఇప్పుడు వికెట్ తీసిన తర్వాత సిరాజ్ ఈ స్టైల్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ గప్‌చుప్ స్టైల్ తన విమర్శకుల కోసమనీ అతడు చెప్పడం విశేషం. ఇక నోళ్లు మూసుకోండి అన్నట్లుగా సిరాజ్ ఈ కొత్త స్టైల్ సెలబ్రేషన్‌కు తెర తీశాడు. నన్ను ద్వేషించే వాళ్ల కోసమే ఈ స్టోరీ. నా గురించి వాళ్లు ఎన్నో అన్నారు. నేను అది చేయలేను, ఇది చేయలేను అని విమర్శించారు. అందుకే నేను బంతితోనే వాళ్లకు సమాధానం చెప్పాలనుకున్నాను. అలా ఈ కొత్త స్టైల్ సెలబ్రేషన్ వచ్చింది అని సిరాజ్ చెప్పడం విశేషం.
లార్డ్స్‌లో తాను ఆడుతున్న తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనే 4 వికెట్లతో సిరాజ్ అదరగొట్టాడు. ఇక రాహుల్‌పై గ్యాలరీలోని అభిమానులు సీసా బిరడా విసరడంపై కూడా సిరాజ్ స్పందించాడు. ఆ విషయం గురించి తనకు పూర్తిగా తెలియదని, అయితే వాళ్లు అభ్యంతరకర వ్యాఖ్యలైతే ఏమీ చేయలేదని చెప్పాడు.