శుక్రవారం 03 జూలై 2020
Sports - Apr 30, 2020 , 08:07:48

అభిమానులు లేకుంటే.. స్టార్స్ లేరు

అభిమానులు లేకుంటే.. స్టార్స్ లేరు

వారి ఆరోగ్యం కోసం దేనికైనా రెడీ: ర‌హానే

న్యూఢిల్లీ: అభిమానుల అండ‌దండ‌లు లేకుంటే స్టార్స్ ఉండ‌ర‌ని టీమ్ఇండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్యా ర‌హానే పేర్కొన్నాడు. అభిమాన బ‌లంతోనే ఈ స్థాయికి వ‌చ్చామ‌న్న జింక్స్‌.. వారి ఆరోగ్యం కోసం ఏం చేసేందుకైనా సిద్ధ‌మే అని ప్ర‌క‌టించాడు. ఐపీఎల్ అయినా లేదా మ‌రే ఇత‌ర టోర్నీ అయినా.. ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించ‌కుండా నిర్వ‌హిస్తే.. అందులో పాల్గొనేందుకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని ర‌హానే అన్నాడు. 

`దేశ‌వాళీ క్రికెట్‌లో ఖాళీ మైదాన‌ల్లో ఆడిన అనుభ‌వం ప్ర‌తి ఒక్క అభిమానికి ఉంది. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించ‌కుండా.. ఖాళీ స్టేడియంల‌లో ఐపీఎల్ నిర్వ‌హిస్తే.. ఆడేందుకు సిద్ధ‌మే. అభిమానుల అండ‌దండ‌ల‌తోనే  ఈ స్థాయికి చేరాం. వారి ఆరోగ్యం క‌న్నా ఏదీ ఎక్కువ కాదు` అని ర‌హానే చెప్పాడు.


logo