బుధవారం 08 ఏప్రిల్ 2020
Sports - Mar 19, 2020 , 23:36:24

ఐపీఎల్‌ ఆగితే నష్టపోతాం

ఐపీఎల్‌ ఆగితే నష్టపోతాం

మెల్‌బోర్న్‌: కరోనా వైరస్‌ కారణంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 13వ సీజన్‌ నిలిచిపోతే.. తమకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదముందని ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో తామంతా సమిష్ఠిగా ఉంటామని పేర్కొన్నాడు. ‘ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డులో ఆటగాళ్ల ఆదాయం వాటాల పద్ధతి (రెవెన్యూ షేర్‌ మోడల్‌)లో ఉంటుంది. అంటే బోర్డుకు నష్టం వాటిల్లితే ఆ ప్రభావం ఆటగాళ్ల ఆదాయంపై కూడా పడుతుంది. ఇలాంటి స్థితిలో మేమంతా కలిసికట్టుగా ఉండాలని నిర్ణయించుకున్నాం. దీర్ఘ కాలంలో వైరస్‌ ప్రభావం తగ్గి  సాధారణ స్థితి నెలకొంటుందని నమ్ముతున్నాం. కానీ అదెప్పుడనేది చెప్పలేం’అని ఫించ్‌ పేర్కొన్నాడు. ఆసీస్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌ ఆడేందుకు క్రికెట్‌ ఆస్ట్రేలియా  గతంలోనే ‘నిరభ్యంతర పత్రం’ఇవ్వడంతో.. ఇప్పుడు దానిపై పునఃసమీక్షించనుంది.  


logo