శనివారం 04 ఏప్రిల్ 2020
Sports - Feb 23, 2020 , 00:16:51

భారత్‌ బోనస్‌ విజయం

భారత్‌ బోనస్‌ విజయం
  • షూటౌట్‌లో ఆసీస్‌ చిత్తు

భువనేశ్వర్‌: భారత పురుషుల హాకీ జట్టు అదరగొట్టింది. ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ మూడో ‘టై’ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఓటమికి బదులు తీర్చుకుంది. శనివారం ఇక్కడి కళింగ స్టేడియంలో ఇరు జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్‌ 2-2తో ‘డ్రా’ కాగా.. షూటౌట్‌లో విజృంభించిన మనవాళ్లు 3-1తో కంగారూలపై కసి తీర్చుకున్నారు. ఈ విజయంతో భారత్‌ బోనస్‌ పాయింట్‌ సాధించి మొత్తం 10 పాయింట్లతో పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. 


ఆస్ట్రేలియా ఖాతాలో కూడా 10 పాయింట్లే ఉన్నా.. గోల్స్‌ తేడాతో ఆ జట్టు రెండో ప్లేస్‌లో ఉంది. నిర్ణీత సమయంలో భారత్‌ తరఫున రూపిందర్‌పాల్‌ సింగ్‌ (25వ ని.లో), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (27వ ని.లో) చెరో గోల్‌ నమోదు చేయగా.. ఆస్ట్రేలియా తరఫున ట్రెంట్‌ మిట్టన్‌ (23వ ని.లో), అరాన్‌ జాలస్కీ (46వ ని.లో) ఓక్కో గోల్‌ చేశారు. అనంతరం జరిగిన షూటౌట్‌లో హర్మన్‌ప్రీత్‌, వివేక్‌ సాగర్‌ ప్రసాద్‌, లలిత్‌ ఉపాధ్యాయ్‌ గోల్స్‌ చేయగా.. ఆసీస్‌ తరఫున డానియల్‌ బేలే ఒక్కడే విజయవంతమయ్యాడు. భారత గోల్‌ కీపర్‌ శ్రీజేశ్‌ ప్రత్యర్థి ప్రయత్నాలను నీరుగార్చడంతో భారత్‌ విజయం ఖాయమైంది.


logo