శనివారం 04 జూలై 2020
Sports - Apr 24, 2020 , 20:35:08

ఎఫ్ఐహెచ్​ ప్రొ లీగ్ రెండో సీజన్ ఏడాది పొడిగింపు

ఎఫ్ఐహెచ్​ ప్రొ లీగ్ రెండో సీజన్ ఏడాది పొడిగింపు

లుసానే: ఎఫ్​ఐహెచ్​ ప్రొ లీగ్ రెండో సీజన్​ వచ్చే ఏడాది జూన్ వరకు జరుగనుంది. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం మ్యాచ్​లన్నీ రద్దవుతుండడంతో సీజన్​ను ఏడాది పాటు పొడిగిస్తూ అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్​ఐహెచ్​) నిర్ణయం తీసుకుంది. ఇందుకు లీగ్​లో పాల్గొంటున్న భారత్ సహా 11దేశాల హాకీ సంఘాలు అంగీకరించాయని శుక్రవారం ప్రకటించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది జనవరిలో రెండో సీజన్ ప్రారంభమై జూన్​లో ముగియాల్సింది. అయితే కరోనా వైరస్ కారణంగా మార్చి తర్వాతి పోటీలన్నీ రద్దవడంతో వచ్చే ఏడాది జూన్ వరకు నిర్వహించాలని ఎఫ్​ఐహెచ్​ నిర్ణయించింది. భువనేశ్వర్ వేదికగా వచ్చే నెల 23,24 తేదీల్లో న్యూజిలాండ్​తో భారత్ ఆడాల్సిన రెండు మ్యాచ్​లు సైతం కరోనా కారణంగా ఇప్పటికే రద్దయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రెండో సీజన్​లో భారత్​ రెండు విజయాలు, రెండు పరాజయాలు, రెండు డ్రాలతో 10పాయింట్లు సాధించి నాలుగో స్థానంలో ఉంది. 


logo