గురువారం 16 జూలై 2020
Sports - May 01, 2020 , 15:27:39

ప్ర‌పంచ‌క‌ప్ అంబాసిడ‌ర్‌కు క‌రోనా పాజిటివ్‌

ప్ర‌పంచ‌క‌ప్ అంబాసిడ‌ర్‌కు క‌రోనా పాజిటివ్‌

దోహ‌:  ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్ 2022 అంబాసిడ‌ర్‌కు క‌రోనా వైర‌స్ పాజిటివ్‌గా నిర్ధ‌ర‌ణ అయింది. ఖ‌త‌ర్ వేదిక‌గా జ‌ర‌గనున్న మెగాటోర్నీ ఏర్పాట్ల‌లో ముగినిపోయిన మాజీ ఆట‌గాడు అదిల్ ఖ‌మీస్‌కు కొవిడ్‌-19 సోకింది. ఈ మేర‌కు టోర్న‌మెంట్ నిర్వ‌హ‌ణ కోసం ఏర్పాటు చేసిన సుప్రీం క‌మిటీ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. 

ఖ‌మీస్ ప‌రిస్థితిని ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నామ‌ని.. భ‌య‌పడాల్సిన అవ‌స‌రం లేద‌ని సుప్రీం క‌మిటీ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. ఖ‌త‌ర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 13,409 మందికి  క‌రోనా వైర‌స్ సోక‌గా.. అందులో 1372 మంది కోలుకున్నారు. 10 మంది మృత్యువాత ‌ప‌డ్డారు.

తాజావార్తలు


logo