శనివారం 28 నవంబర్ 2020
Sports - Nov 10, 2020 , 19:58:45

టాప్‌లేపిన ముంబై: 22 పరుగులకే 3 వికెట్లు

 టాప్‌లేపిన ముంబై:  22 పరుగులకే  3 వికెట్లు

దుబాయ్:‌  ఐపీఎల్‌-13 ఫైనల్‌ పోరులో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న  మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ మొదటి బంతికే మార్కస్‌ స్టాయినీస్(0)‌ వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ డికాక్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.  మళ్లీ బౌల్ట్‌ తన తర్వాతి ఓవర్లో రహానె()2ను పెవిలియన్‌ పంపాడు.

జయంత్‌ యాదవ్‌ వేసిన నాలుగో ఓవర్లో సూపర్‌ ఫామ్‌లో ఉన్న శిఖర్‌ ధావన్(15)‌ బౌల్డ్‌ అయ్యాడు.  22 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఢిల్లీ  కష్టాల్లో పడింది.  5 ఓవర్లకు ఢిల్లీ 3 వికెట్లకు 35 పరుగులు చేసింది. ప్రస్తుతం కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(14), రిషబ్‌ పంత్‌(4) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.