ఆదివారం 07 మార్చి 2021
Sports - Feb 02, 2021 , 10:46:26

జెర్సీ మార్చుకుంటూ బౌండ‌రీ మిస్ చేశాడు.. ఫ‌న్నీ వీడియో

జెర్సీ మార్చుకుంటూ బౌండ‌రీ మిస్ చేశాడు.. ఫ‌న్నీ వీడియో

అబుదాబి: ఇంత‌కుముందెప్పుడూ క్రికెట్‌లో ఇలాంటిది మీరు చూసి ఉండ‌రు. ఓ ఫీల్డ‌ర్ గ్రౌండ్‌లోనే జెర్సీ మార్చుకుంటున్న స‌మ‌యంలో బ్యాట్స్‌మ‌న్ కొట్టిన బాల్ అత‌ని వైపు దూసుకొచ్చింది. జెర్సీ వేసుకోవ‌డం మ‌ధ్య‌లో ఉండ‌టంతో ఆ ఫీల్డ‌ర్ ఆ బంతిని ఆప‌లేక‌పోయాడు. దీంతో అది కాస్తా బౌండరీ లైన్ దాటింది. అబుదాబిలో జ‌రుగుతున్న టీ10 లీగ్‌లో ఈ వింత జ‌రిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారిపోయింది. టీమ్ అబుదాబి ఫీల్డ‌ర్ రోహ‌న్ ముస్తాఫా బౌండరీ ద‌గ్గ‌ర ఫీల్డింగ్ చేస్తున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. జెర్సీ మార్చుకుంటూనే బాల్ వెనుక ప‌రుగెత్తినా దానిని ఆప‌లేక‌పోయాడు. ఇది చూసి త‌న టీమ్‌తోపాటు ప్ర‌త్య‌ర్థి టీమ్ ప్లేయ‌ర్స్ కూడా న‌వ్వుకున్నారు. 

VIDEOS

logo