శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Sports - Aug 24, 2020 , 01:00:54

ఫిడే ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో క్వార్టర్స్‌లో భారత్‌

ఫిడే ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో క్వార్టర్స్‌లో భారత్‌

న్యూఢిల్లీ: ఫిడే ఆన్‌లైన్‌ చెస్‌ ఒలింపియాడ్‌లో అదరగొడుతున్న భారత జట్టు క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం పూల్‌-ఏ టాప్‌ డివిజన్‌లో భాగంగా చైనాతో జరిగిన పోరులో భారత్‌ 4-2తో విజయం సాధించింది. హంపి, హారిక, విదిత్‌, హరికృష్ణ గేమ్‌లను ‘డ్రా’ చేసుకోగా.. ప్రజ్ఞానంద, దివ్య గెలువడంతో క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా భారత్‌ నిలిచింది. 17 పాయింట్లతో భారత్‌ అగ్రస్థానంలో ఉండగా.. చైనా (16పాయింట్లు), జర్మనీ (11 పాయింట్లు), ఇరాన్‌ (9 పాయింట్లు) ఆ తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి.


logo