మంగళవారం 24 నవంబర్ 2020
Sports - Oct 18, 2020 , 18:24:19

ఫెర్గుసన్‌ డబుల్‌ స్ట్రైక్‌.. విలియమ్సన్‌, గార్గ్‌ ఔట్‌

ఫెర్గుసన్‌ డబుల్‌ స్ట్రైక్‌.. విలియమ్సన్‌, గార్గ్‌ ఔట్‌

అబుదాబి: కోల్‌కతా నైట్‌రైడర్స్‌ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రెండు వికెట్లు కోల్పోయింది. ఫెర్గుసన్‌ వేసిన ఆరో ఓవర్‌ తొలి బంతిని అప్పర్‌ కట్‌  షాట్‌ ఆడిన విలియమ్సన్(29)‌ బౌండరీ లైన్‌ వద్ద  నితీశ్‌ రాణా చేతికిచిక్కాడు. కోల్‌కతా ఇన్నింగ్స్‌లో ఫీల్డింగ్‌ చేస్తుండగా గాయపడిన విలియమ్సన్‌..ఓపెనర్‌గా వచ్చాడు.

  గాయంతో బాధపడుతూనే ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరించాడు. మరో ఓపెనర్‌ బెయిర్‌స్టో కూడా వేగంగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు.  పవర్‌ప్లేలో వికెట్‌ నష్టపోకుండా 57 పరుగులు చేసింది.  ఫెర్గుసన్‌ వేసిన ఎనిమిదో ఓవర్లో మరో వికెట్‌ పడగొట్టాడు. నాలుగో బంతికి గార్గ్‌ బౌల్డ్‌ అయ్యాడు.  9 ఓవర్లకు హైదరాబాద్‌ రెండు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. ప్రస్తుతం జానీ బెయిర్‌స్టో(36), వార్నర్‌(0) క్రీజులో ఉన్నారు.