టోక్యో: ఒలింపిక్స్‌లో ఓ కోచ్ ఓ ఫెన్సింగ్ ప్లేయర్‌కు టీవీ కెమెరాల ముందే ప్రపోజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అర్జెంటీనా ఫెన్సర్ మారియా బెలెన్ పెరెజ్ మారిస్ అనే ఆ ప్లేయర్ లైవ్‌లో తన కోచ్ చేసిన పని చూసి ఆశ్చర్యపోయింది. అయితే అతని ప్రేమను అంగీకరించి పెళ్లికి అంగీకరించడం విశేషం. అంతకుముందే తొలి రౌండ్ మ్యాచ్‌లోనే ఓడిన బాధలో ఆమె ఇంటర్వ్యూ ఇస్తోంది. ఇంతలో ఆమె వెనుక నుంచి.. నన్ను పెళ్లి చేసుకుంటావా అని రాసి ఉన్న ప్లకార్డు పట్టుకొని కోచ్ లూకాస్ సాసెడో నిల్చున్నాడు.
కోచ్ సడెన్‌గా అలా చేయడం చూసి పెరెజ్ ఆశ్చర్యపోయింది. చాలా మంది మనల్ని చూస్తున్నారు.. ఎస్ అని చెప్పు అని కోచ్ మోకాలిపై కూర్చొని వేడుకున్నాడు. దీంతో ఆమె వెంటనే ఓకే చెప్పేసింది. నిజానికి అతడు ఇలా ప్రాధేయపడటం ఇదే తొలిసారి కాదు. 2010లోనూ పారిస్‌లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్స్ సందర్భంగా ఇలాగే కెమెరా ముందు ఆమెకు ప్రపోజ్ చేశాడు. కానీ జోక్ చేస్తున్నావా అంటూ ఆమె లైట్ తీసుకోవడంతో అతడు నిరాశ చెందాడు.
ఇప్పుడు 11 ఏళ్ల తర్వాత మళ్లీ అలాగే చేసి సక్సెస్ అయ్యాడు. ఈ ఇద్దరూ ఏకంగా 17 ఏళ్ల నుంచీ రిలేషన్షిప్లో ఉండటం విశేషం. సాసెడోకు ఎస్ చెప్పిన తర్వాత ఆమె సంతోషం పట్టలేక ఏడ్చేసింది. అర్జెంటీనా వెళ్లిన తర్వాత తాము సెలబ్రేట్ చేసుకుంటామని చెప్పింది.