ఆదివారం 07 జూన్ 2020
Sports - Apr 01, 2020 , 23:08:49

షాక్ లో సెరెనా, ఫెద‌రర్

షాక్ లో సెరెనా, ఫెద‌రర్

షాక్ లో సెరెనా, ఫెద‌రర్ 

లండ‌న్: ప‌్ర‌మాద‌క‌ర క‌రోనా వైర‌స్ క్రీడా టోర్నీల‌ను నీడ‌లా వెంటాడుతున్న‌ది. వైర‌స్ ధాటికి చిన్న, పెద్ద టోర్నీల‌న్నీ ర‌ద్ద‌వ‌డమో లేక వాయిదా ప‌డుతున్నాయి. రోజురోజుకు ఈ జాబితా అంత‌కంత‌కు పెరుగుతూనే ఉన్న‌ది. అయితే సుదీర్ఘ చ‌రిత్ర క‌ల్గిన వింబ‌ల్డ‌న్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ కూడా దీనికి అతీతం కాలేక‌పోయింది. వింబుల్డ‌న్ క్యాన్సిల్ కావ‌డం దిగ్గ‌జ‌ టెన్నిస్ ఆట‌గాళ్లు రోజ‌ర్ ఫెద‌ర‌ర్‌, సెరెనా విలియ‌మ్స్‌తో పాటు భార‌త స్టార్ ప్లేయ‌ర్ సానియా మీర్జాను ఒక్క‌సారిగా షాక్‌కు గురి చేసింది. ర‌ద్దు వార్త విన్న వీరు సోష‌ల్‌మీడియా ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు.  ఇక కెరీర్ చ‌ర‌మాంకంలో ఉన్న ఫెద‌రర్‌, సెరెనా ఈ యేటి వింబుల్డ‌న్ కీల‌కమ‌ని అంద‌రూ భావించారు. కానీ తాజా నిర్ణ‌యంతో వీరి అంచ‌నాలు పూర్తిగా త‌ల‌క్రిందుల‌య్యాయి. వింబుల్డ‌న్ ర‌ద్దుపై స్విస్ గ్రేట్ ఫెద‌ర‌ర్ త‌న‌దైన శైలిలో స్పందిస్తూ ‘ నా ఫీలింగ్స్‌కు ఇంత‌క‌న్నా వేరే మార్గం లేదు’ అని ట్వీట్ చేశాడు. మ‌రోవైపు సెరెనా, సానియా కూడా త‌మ నిరాశ‌ను వ్య‌క్తం చేస్తూ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ లు పెట్టారు. రెండో ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత వింబుల్డ‌న్ ర‌ద్దు కావ‌డం ఇదే తొలిసారి.


logo