బుధవారం 01 ఏప్రిల్ 2020
Sports - Feb 19, 2020 , 23:29:51

ఏఎఫ్‌సీ చాంపియన్స్‌ లీగ్‌కు గోవా అర్హత

 ఏఎఫ్‌సీ చాంపియన్స్‌ లీగ్‌కు గోవా అర్హత

జంషెడ్‌పూర్‌: భారత ఫుట్‌బాల్‌ చరిత్రలో సరికొత్త అధ్యాయం. ప్రతిష్ఠాత్మక ఏఎఫ్‌సీ చాంపియన్స్‌ లీగ్‌లో బెర్తు దక్కించుకున్న తొలి భారత క్లబ్‌గా ఎఫ్‌సీ గోవా నిలిచింది. ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్‌ఎల్‌)లో భాగంగా బుధవారం జంషెడ్‌పూర్‌ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో గోవా 5-0తో ఘన విజయం సాధించింది. హ్యుగో బౌమస్‌(70ని, 90ని) డబుల్‌ గోల్స్‌ విజృంభించగా, ఫెర్రాన్‌ కొరోమినాస్‌(11ని), జాకిచాంద్‌ సింగ్‌(84ని), మౌర్టడా ఫాల్‌(87ని) గోల్స్‌ చేశారు. దీనికి తోడు లీగ్‌ దశలో అత్యధిక గోల్స్‌(46)తో ఇది వరకు తమ పేరిటే ఉన్న రికార్డును గోవా తిరుగరాసింది. 


logo
>>>>>>