ఆదివారం 29 మార్చి 2020
Sports - Mar 19, 2020 , 23:38:44

ఒలింపిక్స్‌లో కబడ్డీ కోసం కృషి

ఒలింపిక్స్‌లో కబడ్డీ కోసం కృషి

  • కేంద్ర  క్రీడాశాఖ మంత్రి రిజిజు 

న్యూఢిల్లీ: గ్రామీణ క్రీడ కబడ్డీకి ఒలింపిక్స్‌లో చోటు దక్కేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు చెప్పారు. గురువారం.. లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎదురైన ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. ‘2,880 మంది అథ్లెట్లను ఖేలో ఇండియా పథకం కింద ఎంపిక చేసి.. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో మరింత రాణించేలా శిక్షణ ఇస్తున్నాం. కబడ్డీ మన దేశ గ్రామీణ క్రీడ. కబడ్డీ పోటీలను ఒలింపిక్స్‌లో చేర్చేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది’ అని రిజిజు అన్నారు. 

ఐపీఎల్‌ భవితవ్యం.. ఏప్రిల్‌ 15తర్వాతే.. 

వచ్చే నెల 15వ తేదీ తర్వాత ఐపీఎల్‌  భవితవ్యం తేలుతుందని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు చెప్పారు. కరోనా వైరస్‌ ప్రభావాన్ని సమీక్షించి ఆ రోజున కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను వెల్లడించనుంది. ‘అప్పటి పరిస్థితిని బట్టి ఏప్రిల్‌ 15న కేంద్రం కొత్త మార్గదర్శకాలు, సూచనలను ప్రకటిస్తుంది. క్రికెట్‌ గురించి బీసీసీఐ చూసుకుంటుంది. క్రీడా ఈవెంట్లను నిర్వహించాలా వద్దా అన్నది ప్రశ్న కాదు. వేలాది మంది హాజరవుతారు కాబట్టి ప్రజల రక్షణే అసలు ప్రశ్న’ అని రిజిజు పేర్కొన్నారు.


logo