శుక్రవారం 22 జనవరి 2021
Sports - Dec 06, 2020 , 16:00:15

కోహ్లీని ట్రోల్‌ చేస్తున్న ఫ్యాన్స్‌

కోహ్లీని ట్రోల్‌ చేస్తున్న ఫ్యాన్స్‌

సిడ్నీ: భారత్‌తో రెండో టీ20లో ఆస్ట్రేలియా ఓపెనర్‌ మాథ్యూ వేడ్‌(58: 32 బంతుల్లో 10ఫోర్లు, సిక్స్‌)  బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఫామ్‌లో ఉన్న  మాథ్యూ అర్ధశతకం పూర్తైన తర్వాత అనూహ్యంగా రనౌటయ్యాడు. ఎనిమిదో ఓవర్లో  అతడు ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వదిలేయడంపై  అభిమానులు సోషల్‌మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సింపుల్‌ క్యాచ్‌ను వదిలేసిన విరాట్‌ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు. గత కొన్ని మ్యాచ్‌ల నుంచి విరాట్‌ క్యాచ్‌లు వదిలేస్తున్నాడని విమర్శిస్తున్నారు. 

సుందర్‌ వేసిన స్లో బంతిని  ఫ్లిక్‌ చేసేందుకు ప్రయత్నించగా బంతి బ్యాట్‌కు ఎడ్జ్‌ తీసుకొని కవర్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లీ మీద నుంచి వెళ్లింది. విరాట్‌ క్యాచ్‌ అందుకునే ప్రయత్నంలో బంతి అతని చేతులకు తాకి కింద పడింది. అదే సమయంలో  పరుగు కోసం ప్రయత్నించిన వేడ్‌   పిచ్‌ మధ్యవరకు  వచ్చేశాడు. కోహ్లీ బంతిని వెంటనే వికెట్‌ కీపర్‌ రాహుల్‌వైపు విసరడంతో వేడ్‌ రనౌటయ్యాడు. logo