మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Sports - Sep 11, 2020 , 20:05:40

యూవీ ఆట‌ను అభిమానులు ఇష్ట‌ప‌డ‌తారు : గ‌ంభీర్‌

యూవీ ఆట‌ను అభిమానులు ఇష్ట‌ప‌డ‌తారు :  గ‌ంభీర్‌

యువరాజ్ సింగ్ పంజాబ్ తరఫున టీ20 క్రికెట్ ఆడటానికి త‌న రిటైర్మంట్‌ను వెన‌క్కి తీసుకుంటున్న‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌పై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ స్పందించారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయం అని, అయితే అతడి అభిమానులు క్రికెట్ రంగంలో అత‌డిని తిరిగి చూడటానికి ఇష్టపడతారని అన్నారు.

భారతదేశానికి రెండు ప్ర‌పంచ క‌ప్‌లు అందించ‌డంలో ఈ ఇద్ద‌రు మాజీలు కీల‌క పాత్ర పోషించారు. 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్‌లో వీరిద్ద‌రూ అసాధార‌ణ ప్ర‌తిభ క‌న‌బ‌ర్చారు. యూవీ క్రికెట్‌లోకి తిరిగి రావ‌డానికి ‘అత్యంత స్వాగతం’ అని గంభీర్ అన్నాడు. "అతను పంజాబ్ తరపున ఆడాలనుకుంటే ఆడొచ్చు. మీరు క్రికెట్‌ను ప్రారంభించమ‌ని, ముగించమ‌ని  ఏ ఒక్క‌రూ బలవంతం చేయరు. అతడు పదవీ విరమణ నుంచి తిరిగి వచ్చి ప్రేరణతో ఆడాలనుకుంటే క‌‌చ్చితంగా స్వాగతించబడ‌తాడు” అని గంభీర్ అన్నాడు. 

40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20లు ఆడిన యువ‌రాజ్ గతేడాది రిటైర్మెంట్ ప్రకటించాడు. మూడు ఫార్మాట్లలో వరుసగా 1900, 8701, 1177 పరుగులు సాధించాడు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo