శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Sports - Mar 03, 2020 , 15:18:41

కార్నర్‌ సీట్‌లోనే ధోనీ..ఫాలో చేసిన ఫ్యాన్స్‌:వీడియో

కార్నర్‌ సీట్‌లోనే ధోనీ..ఫాలో చేసిన ఫ్యాన్స్‌:వీడియో

చెన్నై: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌  మహేంద్ర సింగ్‌ ధోనీకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహీ ఎక్కడ కనిపించినా కెప్టెన్‌ కూల్‌తో ఫొటోలు దిగేందుకు, తమ ఫోన్లతో వీడియోలు తీసేందుకు  అభిమానులు వెంటపడుతూనే ఉంటారు. ఈ నెల 29 నుంచి ఐపీఎల్‌ మొదలవుతున్న నేపథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ అయిన ధోనీ  ఎంఏ చిదంబరం స్టేడియంలో ఏర్పాటు చేసిన తొలి ప్రాక్టీస్‌ సెషన్‌లో పాల్గొన్నాడు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌తో సెమీస్‌ తర్వాత ధోనీ మైదానంలో అడుగుపెట్టడం ఇదే తొలిసారి. 

స్టేడియంలో ప్రాక్టీస్‌ అనంతరం చెన్నై ఆటగాళ్లు  బస్సులో హోటల్‌కు  వెళ్తుండగా ధోనీని చూసి ఫాలో చేయడం మొదలెట్టారు. సిగ్నల్స్‌ దగ్గర బస్సు ఆగినప్పుడు ధోనీని తమ మొబైల్‌ కెమెరాలతో ఫొటోలు తీసేందుకు ఎగబడ్డారు. మహీకి అభివాదం చేస్తూ కేకలు,ఈలలతో హోరెత్తించారు.  ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది.
logo