మంగళవారం 26 మే 2020
Sports - May 23, 2020 , 21:44:27

అభిమానుల వల్లే క్రీడలకు అందం: రోహిత్‌ శర్మ

అభిమానుల వల్లే క్రీడలకు అందం: రోహిత్‌ శర్మ

న్యూఢిల్లీ: ఏ క్రీడకైనా ప్రేక్షకులే అదనపు హంగులను, ఉత్తేజాన్ని తీసుకొస్తారని, వారి వల్లే ఆటలకు అందం వస్తుందని టీమ్‌ఇండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అభిప్రాయపడ్డాడు. ఫేస్‌బుక్‌ లైవ్‌లో లాలీ గా ఫుట్‌బాల్‌ టోర్నీ అధికారిక ఖాతాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  రోహిత్‌ మాట్లాడాడు.

"ప్రపంచ వ్యాప్తంగా జరిగే అన్ని క్రీడాపోటీలకు వారు(అభిమానులు) ఎంతో ముఖ్యం. అన్ని క్రీడలను ఆకర్షణీయంగా, అందంగా కనిపించేందుకు కారణం వారే. అందుకే తొలుత అందరి క్షేమం కోసం చర్యలు తీసుకోవాలి. అంతా కుదుటపడ్డాకే స్టేడియాల్లో వారిని అనుమతించాలి. ప్రతి ఒక్కరి క్షేమం, రక్షణే అతి ముఖ్యం. ఏ జాగ్రత్తలు తీసుకున్నా, ఏ చర్య చేసినా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి' అని రోహిత్‌ శర్మ చెప్పాడు.  


logo