గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Sep 10, 2020 , 19:17:09

ఐపీఎల్ హంగామా.. ఫ్యాన్ కోడ్ షాప్ ప్రారంభం

ఐపీఎల్ హంగామా.. ఫ్యాన్ కోడ్ షాప్ ప్రారంభం

అభిమానుల‌కు అద్భుత అవ‌కాశం. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ రానే వ‌చ్చింది. మరో వారం వ్య‌వ‌ధిలో మ‌న‌ల్ని అల‌రించేందుకు సర్వ‌హంగుల‌తో సిద్ధ‌మైంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో యూఏఈలో జ‌రుగుతున్న టోర్నీలో ఎనిమిది జ‌ట్లు బ‌రిలోకి దిగుతున్నాయి. క‌ప్‌ను ఎలాగైనా కైవ‌సం చేసుకోవాల‌న్న ప‌ట్టుద‌ల‌తో క‌నిపిస్తున్న జ‌ట్లు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో సిద్ధ‌మ‌య్యాయి. అయితే త‌మ అభిమాన జట్ల‌కు మ‌ద్ద‌తు ప‌లికేందుకు ఫ్యాన్స్ కూడా సిద్ధ‌మ‌య్యారు. లీగ్‌కు ఉన్న‌ ఆద‌ర‌ణ‌ను ద్రుష్టిలో పెట్టుకుని డ్రీమ్ స్పోర్ట్స్ ఫ్యాన్ కోడ్ షాప్‌ను ప్రారంభించింది. ఐపీఎల్‌లోని ఏడు ప్రముఖ జట్లు హైద‌రాబాద్‌, చెన్నై, పంజాబ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌, ముంబై, కోల్‌క‌తా జ‌ట్ల‌కు చెందిన అన్ని ర‌కాల వ‌స్తువుల‌ను అందుబాటులో ఉంచింది. 


ఇందులో జ‌ట్ల అధికారిక జెర్సీల‌తో పాటు క్యాప్‌లు, టీష‌ర్ట్స్‌,  కీచెన్లు,లోయ‌ర్లు ఆన్‌లైన్‌లో అమ్మ‌కానికి సిద్దంంగా ఉంచింది. అత్యుత్త‌మ శ్రేణిలో మ‌న్నిక క‌ల్గిన బ్రాండ్ల‌ను అందుబాటు ధ‌ర‌లో తీసుకొచ్చింది. www.shop.fancode.com వెబ్‌సైట్ ద్వారా త‌మ‌కు న‌చ్చిన వాటిని ఎంపిక చేసుకొని కోనుగోలు చేసుకోవ‌చ్చు. త‌క్కువ వ్య‌వ‌ధిలో హోం డెలీవ‌రి అందించేలా కంపెనీ ప్ర‌తినిధులు ఏర్పాట్లు చేశారు. 


logo