గురువారం 02 ఏప్రిల్ 2020
Sports - Jan 27, 2020 , 12:44:23

ప్రముఖ బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు మృతి

ప్రముఖ బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు మృతి

వాషింగ్టన్‌ డీసీ: అమెరికా బాస్కెట్‌బాల్‌ క్రీడాకారుడు, లెజెండరీ ప్లేయర్‌.. కోబ్‌ బ్రయంట్‌(41) ఆదివారం జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. ఆయన పయణిస్తున్న వ్యక్తిగత  హెలికాప్టర్‌ కాలిఫోర్నియాలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో కోబ్‌ బ్రయంట్‌, ఆయన కుమార్తె సహా 9 మంది మరణించారు. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, కోబ్‌ బ్రయంట్‌ మాజీ ఎన్‌బీఏ స్టార్‌ ప్లేయర్‌ కావడం విశేషం. గతంలో ఫోర్బ్స్‌ ప్రకటించిన అత్యధిక ధనవంతుల క్రీడాకారుల జాబితాలో బ్రయంట్‌ చాలా సార్లు తన పేరును నిలుపుకున్నాడు. 


logo