బుధవారం 02 డిసెంబర్ 2020
Sports - Oct 14, 2020 , 15:22:34

2014 తర్వాత తొలిసారి డకౌట్..ఆ బ్యాట్స్‌మన్‌ ఎవరంటే?‌

2014 తర్వాత తొలిసారి డకౌట్..ఆ బ్యాట్స్‌మన్‌ ఎవరంటే?‌

దుబాయ్:  ఐపీఎల్‌లో గత కొన్నేండ్లుగా మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని  చెన్నై  సూపర్‌ కింగ్స్‌ సాధించిన  విజయాల్లో   స్టార్‌ బ్యాట్స్‌మన్‌  డుప్లెసిస్‌ పాత్ర ఎంతో ఉంది.  బ్యాట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడే డుప్లెసిస్‌..అద్భుత ఫీల్డింగ్‌ విన్యాసాలతో  కళ్లు చెదిరే క్యాచ్‌లను అందుకున్నాడు.  ముఖ్యంగా జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు  అత్యుత్తమ  అటతీరును ప్రదర్శిస్తుంటాడు.   

ఐపీఎల్‌-13లో  నిలకడగా రాణిస్తున్న డుప్లెసిస్‌..మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఖాతా అయినా  తెరువకుండానే మూడో ఓవర్లో వికెట్‌ కీపర్‌ బెయిర్‌స్టోకు  క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.  ఓపెనర్‌ డుప్లెసిస్‌ (0) తాను ఎదుర్కొన్న తొలి బంతికే  పెవిలియన్‌ చేరాడు.   మూడో ఓవర్‌లోనే ఓపెనర్‌ డుప్లెసిని డకౌట్‌ చేసిన సందీప్‌ శర్మ చెన్నైకి  ఝలక్‌ ఇచ్చాడు.

ఓవరాల్‌గా  ఐపీఎల్‌లో డుప్లెసిస్‌ డకౌట్‌ కావడం మూడోసారి కాగా,,2014 తర్వాత ఇదే మొదటిసారి కావడం గమనార్హం.  ప్రస్తుత సీజన్‌లో చెన్నై తరఫున  అద్భుతంగా రాణిస్తూ చెన్నై తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.   సీజన్‌లో ఇప్పటి వరకు  51.16 సగటుతో 307 పరుగులు సాధించాడు.