బుధవారం 23 సెప్టెంబర్ 2020
Sports - Sep 01, 2020 , 12:20:20

దుబాయ్‌ చేరుకున్న ఆ ముగ్గురు క్రికెటర్లు

దుబాయ్‌ చేరుకున్న  ఆ ముగ్గురు   క్రికెటర్లు

దుబాయ్‌: సౌతాఫ్రికా త్రయం  డుప్లెసిస్‌, లుంగీ ఎంగిడి, కగిసో రబాడ మంగళవారం ఉదయం  దుబాయ్‌ చేరుకున్నారు.  రాబోయే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో తమ జట్ల తరఫున ఆడేందుకు ఇక్కడికి వచ్చారు.  దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ డుప్లెసిస్‌, స్పీడ్‌స్టర్‌ ఎంగిడి చెన్నై సూపర్‌ కింగ్స్‌ క్యాంప్‌లో చేరగా..పేసర్‌ రబాడ ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌ హోటల్‌కు వెళ్లాడు.

ఈ  రెండు ఫ్రాంఛైజీలు కూడా తమ అధికారిక ట్విటర్లో ప్రొటీస్‌ ప్లేయర్ల ఫొటోలను షేర్‌ చేశాయి. దక్షిణాఫ్రికా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ ఏబీ డివిలియర్స్‌ ఇప్పటికే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టులో చేరిపోయాడు. ఐపీఎల్‌ 13వ సీజన్‌ దుబాయ్‌, అబుదాబి, షార్జా వేదికల్లో సెప్టెంబర్‌ 19 నుంచి నవంబవర్‌ 10 వరకు జరగనుంది. logo