e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, August 1, 2021
Home News గైక్వాడ్‌, డుప్లెసిస్‌ అర్ధశతకాలు..భారీ స్కోర్‌ దిశగా చెన్నై

గైక్వాడ్‌, డుప్లెసిస్‌ అర్ధశతకాలు..భారీ స్కోర్‌ దిశగా చెన్నై

గైక్వాడ్‌, డుప్లెసిస్‌ అర్ధశతకాలు..భారీ స్కోర్‌ దిశగా చెన్నై

ముంబై: ఐపీఎల్‌( IPL )- 2021లో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌( Kolkata Knight Riders )తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌( Chennai Super Kings ) భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్లు రుతురాజ్‌ గైక్వాడ్‌( Ruturaj Gaikwad ), డుప్లెసిస్‌( du Plessis ) అర్ధశతకాలతో చెలరేగి చెన్నైకి అదిరే ఆరంభం అందించారు.

ఆరంభం నుంచి కోల్‌కతా బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగులు సాధిస్తున్నారు. గత మ్యాచ్‌ల్లో
తడబడిన గైక్వాడ్‌ ఫామ్‌లోకి వచ్చాడు. ఓపెనర్లు ఇద్దరూ పోటీపడి బౌండరీలు బాదడంతో 12 ఓవర్లకు జట్టు స్కోరు 110 దాటింది. వరుణ్‌ చక్రవర్తి ( Chakravarthy ) వేసిన 13వ ఓవర్లో గైక్వాడ్‌(64) భారీ షాట్‌కు యత్నించి డీప్‌ మిడ్‌వికెట్‌లో కమిన్స్‌ చేతికి చిక్కాడు. 13 ఓవర్లు ముగిసేసరికి చెన్నై వికెట్‌ నష్టానికి 121 పరుగులు చేసింది. డుప్లెసిస్‌(53), మొయిన్‌ అలీ(1) క్రీజులో ఉన్నారు. చేతిలో వికెట్లు ఉండటంతో ఆఖర్లో చెలరేగి భారీ స్కోరు సాధించాలని ధోనీసేన భావిస్తోంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
గైక్వాడ్‌, డుప్లెసిస్‌ అర్ధశతకాలు..భారీ స్కోర్‌ దిశగా చెన్నై
గైక్వాడ్‌, డుప్లెసిస్‌ అర్ధశతకాలు..భారీ స్కోర్‌ దిశగా చెన్నై
గైక్వాడ్‌, డుప్లెసిస్‌ అర్ధశతకాలు..భారీ స్కోర్‌ దిశగా చెన్నై

ట్రెండింగ్‌

Advertisement