శనివారం 05 డిసెంబర్ 2020
Sports - Sep 19, 2020 , 21:14:19

ఆ రెండు క్యాచ్‌లు మ్యాచ్‌కే హైలైట్

ఆ రెండు క్యాచ్‌లు మ్యాచ్‌కే హైలైట్

అబుదాబి: ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా     చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఒకే ఓవర్లో రెండు కీలక వికెట్లు చేజార్చుకున్నది. జడేజా వేసిన 15వ ఓవర్లో  దూకుడుగా ఆడుతున్న సౌరభ్‌ తివారి, హార్డిక్‌ పాండ్య  పెవిలియన్‌ చేరారు. ఇన్నింగ్స్‌ ఆఖర్లో విజృంభించి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాలనుకున్న ముంబైకి చెన్నై షాకిచ్చింది. 

డుప్లెసిస్‌ మరోసారి తన మార్క్‌ ఫీల్డింగ్‌తో ఔరా అనిపించాడు. ఒకే ఓవర్‌లో డుప్లెసిస్‌ అందుకున్న రెండు క్యాచ్‌లు    మ్యాచ్‌లోనే హైలెట్‌గా నిలిచాయి. రెండు కూడా బౌండరీ లైన్‌ వద్ద గాల్లోకి ఎగిరి అందుకోవడం విశేషం.  సిక్స్‌ వెళ్లే బంతులను డుప్లెసిస్‌ బౌండరీ లైన్‌ వద్ద గాల్లోకి ఎగిరి మరీ అద్భుతంగా  అందుకోవడంతో అంతా ఆశ్చర్యపోయారు. . తన మెరుపు ఫీల్డింగ్‌తో ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ ఔట్‌ కావడంతో ముంబై స్కోరు తగ్గింది.