మోన్జా: చాంపియన్ డ్రైవర్లు లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్), మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) కార్లు ప్రమాదానికి గురికావడంతో ఇటాలియన్ గ్రాండ్‌ప్రిలో మెక్లారెన్స్ డ్రైవర్ డానియల్ రికియార్డో విజేతగా నిలిచాడు. మెక్లారెన్స్కు తొమ్మిదేండ్ల తర్వాత ఇదే తొలి విజయం కాగా.. రికియార్డోకు 2018 మొనాక గ్రాండ్ ప్రి తర్వాత ఇదే మొదటి టైటిల్. ఆదివారం జరిగిన రేస్‌లో రికియార్డో (ఒక గంటా 21 నిమిషాల 54.36 సెకన్లలో) అగ్రస్థానంలో నిలువగా.. నోరిస్, వాల్తెరి బొటాస్ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నారు.