గురువారం 24 సెప్టెంబర్ 2020
Sports - Aug 10, 2020 , 02:18:37

విజేత వెర్‌స్టాపెన్‌

విజేత వెర్‌స్టాపెన్‌

 సిల్వర్‌స్టోన్‌ (ఇంగ్లండ్‌): రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ ఈ సీజన్‌లో తొలి విజయం నమోదు చేసుకున్నాడు. ఆదివారం ఇక్కడ జరిగిన ఫార్ములావన్‌ (ఎఫ్‌1) 70వ వార్షికోత్సవ గ్రాండ్‌ప్రి రేసులో అతడు అందరికంటే వేగంగా లక్ష్యాన్ని చేరి టైటిల్‌ సాధించాడు. మాక్స్‌ కంటే 11.3 సెకన్లు ఆలస్యంగా గమ్యాన్ని చేరిన ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ రెండోస్థానంలో నిలిచాడు.  ఏడు దశాబ్దాల క్రితం ఎఫ్‌1 రేసు మొదలైన వేదిక సిల్వర్‌స్టోన్‌ సర్క్యూట్‌లో ఈ రేసు నిర్వహించారు.  ఈ సీజన్‌లో మెర్సిడెస్‌ డ్రైవర్లు (హామిల్టన్‌, బొటాస్‌) కాకుండా ఇతర డ్రైవర్‌ రేస్‌ నెగ్గడం ఇదే తొలిసారి. టైర్లు ఇబ్బంది పెట్టినా హామిల్టన్‌, బొటాస్‌ వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. దీంతో హామిల్టన్‌.. కెరీర్‌లో 155వ పోడియం ఫినిష్‌ చేసి దిగ్గజ రేసర్‌ మైకెల్‌ షూమాకర్‌ సరసన చేరాడు.   


logo