గురువారం 01 అక్టోబర్ 2020
Sports - Sep 01, 2020 , 02:16:55

టీవీ రేటింగ్స్‌ మరింత పెరుగుతాయి: గంగూలీ

టీవీ రేటింగ్స్‌ మరింత పెరుగుతాయి: గంగూలీ

పుణె: యూఏఈ వేదికగా త్వరలో మొదలయ్యే ఐపీఎల్‌ 13వ సీజన్‌కు టెలివిజన్‌ రేటింగ్స్‌(టీవీ) ఈసారి మరింత పెరిగే అవకాశముందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ అన్నాడు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు జరిగే అవకాశముండటంతో చాలా మంది టెలివిజన్లలో చూసేందుకు ఆస్కారముందని దాదా పేర్కొన్నాడు. కొవిడ్‌-19 దృష్ట్యా ప్రేక్షకులు ఇండ్లకే పరిమితమైతే టీవీ రేటింగ్స్‌ రికార్డు స్థాయిలో పెరిగే చాన్స్‌ ఉందని బ్రాడ్‌కాస్టర్లు భావిస్తున్నట్లు తెలిపాడు. సోమవారం ఓ ఆన్‌లైన్‌ కార్యక్రమంలో పాల్గొన్న గంగూలీ మాట్లాడుతూ ‘కరోనా వైరస్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఐపీఎల్‌ ద్వారా సానుకూల దృక్పథాన్ని ఏర్పరచవచ్చు. తిరిగి సాధారణ జీవితానికి అలవాటు పడేలా లీగ్‌ దోహదపడుతుంది’ అని అన్నాడు. 


logo